
Beenadevi Samagra Rachanalu
తెలుగు సాహిత్యంలో బీనాదేవిది ప్రత్యేక స్థానం. భార్యాభర్తలు ఒకే పేరుతో రాయటం వీరితో ప్రసిద్ధమయింది. సామాజిక సంవేదనలలోను, వస్తు స్వీకరణలోనూ, పాత్ర చిత్రణలోనూ, న్యాయవాద వృత్తిలోను రావిశాస్త్రిదీ బీనాదేవిదీ ఒకే మార్గంగా అనిపిస్తుంది. పేదల పక్షాన కోర్టులో వీగిపోయిన వాదనలను సాహిత్యం ద్వారా ప్రజల ముందు రావిశాస్త్రి ఉంచితే మనోధర్మం చెప్పినా, న్యాయదేవత కళ్లగంతల ద్వారా చూడగలిగినా, చెప్పటానికి అవకాశం లేకపోయిన తీర్పులని బీనాదేవి ప్రజల ముందు ఉంచారు.భర్తగారు పోయినా త్రిపురసుందరిగారు బీనాదేవిని అవే స్పందనలతో, బాధ్యతలతో, నేర్పరితనంతో సాహిత్యంలో కొనసాగించారు. ఇంతవరకూ బీనాదేవి పేరిట వెలువడిన కథలు, నవలలు, వ్యాసాలూ లభ్యమైనంతవరకూ సేకరించి డా. ఎల్. నరేంద్రనాధ్ గారి ప్రత్యేక సహకారంతో మనసు ఫౌండేషన్ ఈ సర్వస్వాన్ని తెలుగు పాఠకులకి అందిస్తోంది.* * *విశ్వనాథశాస్త్రి గారి పంథాలోనే నడుస్తున్న మరో వ్యక్తి బీనాదేవి గారు. శాస్త్రి గారిని అనుకరించ యత్నించే వారికి కొదువ లేదు. కానీ బీనాదేవి గారి కథలు అనుకరణలు కావు. వాటి వ్యక్తిత్వం వాటికున్నది. వాటిలోనూ కవిత్వం ఉన్నది. ముందు హృదయాన్ని కదిలించి, తరువాత మెదడును మధించే లక్షణం ఉన్నది- కొడవటిగంటి కుటుంబరావు
Download or read Beenadevi Samagra Rachanalu in PDF formats. You may also find other subjects related with Beenadevi Samagra Rachanalu.
- Filetype: PDF
- Pages: 1,204 pages
- ISBN: / 0
B17b0tgCodZ.pdf